ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, సుకుమార్‌ల ‘పుష్ప-2’ రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ వసూలు చేస్తోంది. వెయ్యి కోట్ల కలెక్షన్లు వసూలు చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన పుష్ప రాజ్, ఆ రికార్డును కేవలం తొమ్మిది రోజులో సాధించి రెండు వేల కోట్ల దిశగా పరుగులు తీస్తోంది.
ఇదిలా ఉంటే, తాజాగా ఈ సినిమా ఖాతాలో మరో కొత్త రికార్డు చేరింది. రూ.806 కోట్లు వసూలు చేసి హిందీ బాక్సాఫీస్ వద్ద నంబర్ వన్ చిత్రంగా నిలిచింది. ఈ స్పెషల్ రిఫరెన్స్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ తాజాగా ప్రోమోను విడుదల చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.