దిల్ రాజు, శిరీష్ జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తునం’. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కథానాయికలు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 14, 2025న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ నుండి మొదటి పాట గోదారి గట్టు సాంగ్ విడుదలైంది. ‘గోదారి గట్టుమీద రామ చిలకవే.. ఓ గోరింటాకెట్టుకున్న సందమామవే’ అంటూ సాగే ఈ మెలోడీ గీతం ఆకట్టుకుంటోంది. ఒక పాట అనంతమైన భావాలు పలికించడం అంటే.. అది ఈ మాయా మెలోడీ గోదారిగట్టు వింటే తెలుస్తోంది.వెంకీ, ఐశ్వర్యల రొమాంటిక్ మెలోడీ అద్భుతం.
బలగం, ధమాఖా మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూర్చగా, భాస్కరభట్ల సాహిత్యమందించారు. దాదాపు 18 ఏళ్ల తర్వాత సీనియర్ సంగీత దర్శకుడు రమణ గోగుల ఈ సాంగ్ తో మళ్ళీ ఎంట్రీ ఇచ్చారు. తెలంగాణ ఫోక్ సింగర్ మధుప్రియతో కలిసి రమణ గోగుల ఈ పాటను తనదైన మార్క్ తో పాడారు.