ఇటీవలి కాలంలో సినిమాలు థియేటర్లలో కొనసాగటానికి సవాళ్లను ఎదుర్కొంటున్నాయి, కొన్నే వారాలకే పరిమితమవుతున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలు తక్కువ రోజుల్లోనే అధిక కలెక్షన్లు రాబట్టి వెళ్లిపోతున్నాయి . గతంలో వంద రోజులు, 50 రోజులు ప్రదర్శనతో నిలకడగా ఆడిన సినిమాలు అభిమానుల దృష్టిలో గర్వకారణంగా నిలిచేవి. ప్రస్తుతం, సుదీర్ఘ ప్రదర్శన గురించి వినడం అరుదు.

ఈ సందర్భంలో ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర చిత్రం థియేటర్లలో 50 రోజులు విజయవంతంగా పూర్తిచేసుకొని రికార్డు సృష్టించింది. దింతో 52 కేంద్రాల్లో 50 రోజులు పూర్తిచేసుకున్న ఈ సినిమా, సినిమా విజయాన్ని సుదీర్ఘ ప్రదర్శనతో మనం అనుభవించిన రోజులను స్మరించిందని చిత్ర బృందం పేర్కొంది. ఎన్ని రోజులు ..? ఎన్ని సెంటర్లు ? అని సినిమా విజయాన్ని చెప్పుకొనే నాటి రోజులను దేవర గుర్తు చేసినట్లు అయింది అని చిత్రబృందం వెల్లడించింది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *