బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీష్ తివారీ అత్యంత భారీ బడ్జెట్ తో బాలీవుడ్ లో ‘రామాయణం’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ రామాయణంలో శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్ నటిస్తున్నారని కొంతకాలం క్రితం వార్తలు వచ్చాయి. మరికొందరు ప్రముఖ నటీనటులు కూడా ఈ చిత్రంలో నటించారు. అయితే ఈ సినిమాపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. 2025 దీపావళికి రామాయణం పార్ట్-1ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఎప్పటికప్పుడు సమాచారం వస్తుంది కానీ ఈ ప్రాజెక్ట్ గురించి మళ్లీ మళ్లీ ఎలాంటి అప్‌డేట్‌లు లేవు. అసలు రామాయణం ఉందా లేదా అని సినీ ప్రేక్షకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్, రకుల్ ప్రీత్ సింగ్, లారా దత్తా వంటి ప్రముఖ నటీనటులు కూడా నటిస్తున్నారు. ఐతే, ఈ సినిమా షూటింగ్ మొదలైన కొద్దిరోజుల్లోనే ఫోటోలు లీక్ అయ్యాయి. దీంతో, మేకర్స్ ప్రస్తుతం ముంబైలో ఇండోర్ షూటింగ్ చేస్తున్నారు. ఐతే ఈ నెల నాలుగో వారం నుంచి జరగబోయే కొత్త షెడ్యూల్ లో సాయి పల్లవి పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలుస్తుంది. ఈ సినిమాలో రావణుడిగా కన్నడ స్టార్ హీరో యష్ యాక్ట్ చేస్తున్నారు. మేకర్స్ ప్రస్తుతం ముంబైలో ఇండోర్ షూటింగ్ చేస్తున్నారు. ఐతే, డిసెంబర్ మొదటి వారం నుంచి జరగబోయే కొత్త షెడ్యూల్ లో క్లైమాక్స్ లోని కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఈ సన్నివేశాలు సినిమాలోనే కీలకం అని, ముఖ్యంగా సాయి పల్లవి నటనను ఎలివేట్ చేసే ఈ సీన్లతో ఆమె నటన స్థాయి మరో మెట్టుకు ఎదుగుతుందని తెలుస్తోంది. అన్నట్టు కన్నడ స్టార్ హీరో యష్ ఈ మూవీ ప్రొడక్షన్ లో కూడా భాగమైనట్లు తెలుస్తోంది. ఆయన సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పవిత్ర ఇతిహాసం రామాయణం ఆధారంగా రాబోతుంది.