యాంకర్ ప్రదీప్ తెలుగు బుల్లి తెరపై తనదైన శైలితో ఆకట్టుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. నిత్యం పలు టీవీ షోలతో బిజీగా ఉండి బుల్లి తెరపై కనిపించడం మానేశాడు. బుల్లితెర ఇండస్ట్రీలో ప్రదీప్ కు తిరుగులేని ఇమేజ్ వచ్చింది. అయితే ప్రస్తుతం యాంకర్ ప్రదీప్ నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు. అందుకే హీరో గా ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రకరకాల కథలు వింటున్నాడు.

యాంకర్ ప్రదీప్ గతం లో 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా తో ప్రేక్షకులని పలకరించాడు. అయితే ఆ సినిమా హీరో గా ప్రదీప్ కి సక్సెస్ ని ఇవ్వలేకపోయింది. అందుకే కొద్ది గా గ్యాప్ తీసుకొని హీరో గా రెండో సినిమా ను చేసేందుకు ప్రదీప్ సిద్ధం అవుతున్నాడు. ఈ గ్యాప్ లో ఆయన ఎన్నో కథ లను విన్నారు. అందులో భాగంగా ఎట్టకేలకు ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోలి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ టైటిల్ తో తన రెండవ సినిమాను ఫిక్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసాడు ప్రదీప్. ఈ సినిమా కోసమే కొన్ని నెలలుగా టివీ షోలకు దూరంగా ఉన్నారు, జబర్దస్త్ తో పాటు పలు కామెడీ షోలను డైరెక్ట్ చేసిన నితిన్, భరత్ లు ఈ సినిమాతో దర్శకులుగా పరిచయం కాబోతున్నారు. సినిమా టైటిల్ ను వర్కింగ్ టైటిల్ గా పెట్టుకున్నారు. షూటింగ్ పూర్తయింది. డిసెంబర్ లో రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారు ,మేకర్స్. ప్రదీప్ సరసన పలు కెమెడీ షోస్ లో యాంకర్, డాన్సర్ గా చేసిన దీపికా పిల్లి హీరోయిన్ గా నటిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *