కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన చిత్రం “మహారాజా”. యువ దర్శకుడు నితిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించారు. ఎలాంటి అంచనాలు, పెద్దగా ప్రమోషన్స్ లేకుండా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో పాటు విడుదలైన అన్ని చోట్ల మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనూహ్య విజయం సాధించి రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. 20 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు నిర్మాతలు.

ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సినిమా హీరో విజయ్ సేతుపతి ఈ సినిమాలో నటించాడు. సినిమా విడుదలయ్యాక లాభాల్లో వాటా తీసుకోమని కోరగా ఆయన అంగీకరించి ఫ్రీగా ఈ చిత్రంలో నటించారని సమాచారం. విడుదల నాటి నుండి సూపర్ హిట్ తో దూసుకు వెళ్లింది ఈ సినిమా. జూన్ 14న విడుదలైన ఈ సినిమా 50 రోజులు విజయవంతంగా ఆడింది. ఇటు తెలుగులోను మహారాజా సూపర్ హిట్ సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాలలో మహారాజా 20కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది. లేటెస్ట్ కోలీవుడ్ పి ఆర్ లెక్కల ప్రకారం 91.5 కోట్ల గ్రాస్ ని అందుకున్నట్టు తెలుస్తుంది. దీనితో మహారాజ చిత్రం అక్కడ 100 కోట్ల మార్క్ కి దూసుకెళ్తుంది అని చెప్పాలి. మరి లాంగ్ రన్ లో ఇంకా ఎన్ని కోట్లు సాధిస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *