ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నివాసానికి టాలీవుడ్ ప్రముఖులు చేరుకున్నారు. శనివారం ఉదయం, హీరో విజయ్ దేవరకొండ తన సోదరుడు ఆనంద్ దేవరకొండతో కలిసి అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా, అల్లు అరవింద్‌కు విషెస్ చెప్పిన విజయ్ దేవరకొండను అల్లు అరవింద్ ఎంతో అప్యాయంగా కౌగిలించుకున్నారు. ఆ సమయంలో ఫోన్ కాల్ ముగించిన అల్లు అర్జున్, విజయ్‌ను సాదరంగా ఆహ్వానించి, హత్తుకున్నారు. అనంతరం విజయ్, అల్లు అర్జున్, అల్లు అరవింద్ మధ్య కొద్దిసేపు ఆత్మీయ సంభాషణ సాగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.
అలాగే, డైరెక్టర్ సుకుమార్ కూడా అల్లు అర్జున్‌ను కలిసేందుకు ఈ సందర్బంగా హాజరయ్యారు. వీరితో పాటు వంశీ పైడిపల్లి, కొరటాల శివ, నిర్మాతలు నవీన్, రవి, దిల్ రాజు తదితరులు అల్లు అర్జున్ నివాసానికి వచ్చి తాజా పరిణామాలపై చర్చించారు. జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్ నివాసంలో ఈ సమావేశం జరగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.