స్టార్ హీరో సూర్య ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘కంగువ’. దర్శకుడు శివ ఈ చిత్రాన్ని భారీ పీరియాడికల్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కించారు. బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ పతాకాలపై కెఇ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘కంగువ’. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని నైజాం ఏరియాలో విడుదల చేయనున్నారు. ‘కంగువ’ చిత్రం నవంబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. టీజర్‌కి మంచి స్పందన వస్తోంది.

ఈ సందర్భంగా హీరో సూర్య మాట్లాడుతూ, ‘నేను చేసే ఓ సినిమా సెట్స్‌ పైకి వెళ్లాలంటే దాని వెనుక చాలా ప్రాసెస్‌ ఉంటుంది. ఏడాది క్రితమే సినిమా చేసే దానిపై చర్చలు జరిగాయి. కాకపోతే ఆ సినిమాను నిర్మాతలు ప్రకటిస్తేనే బాగుంటుంది. అందుకే, నేను ఇప్పుడు ఈ సందర్భంలో ఏమీ చెప్పలేకపోతున్నాను. కానీ బాలీవుడ్ లో కచ్చితంగా డైరెక్ట్ సినిమా చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చారు. దర్శకుడు రాకేశ్‌ ఓంప్రకాశ్‌ డైరెక్షన్లో ఈ సినిమా రానుంది. ఇప్పటికే కంగువా పార్ట్ 2, పార్ట్‌ 3 కథలు సిద్ధంగా ఉన్నాయని, కంగువా పార్ట్‌ 1 విజయం ఆధారంగా వాటిని తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నామని నిర్మాత కేఈ జ్ఞానవేల్‌ చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *