కేంద్ర ప్రభుత్వం 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించింది. 2022 డిసెంబర్ 31 వరకు సెన్సార్ అయిన సినిమాలలో బెస్ట్ చిత్రాలకు నేడు అవార్డులు ప్రకటించారు. ఇందులో భాగంగా మన కార్తికేయ 2 సినిమా అవార్డు గెలుచుకుంది. తెలుగులో నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన కార్తికేయ 2 సినిమా పాన్ ఇండియా వైడ్ భారీ విజయం సాధించి ఆల్మోస్ట్ 130 కోట్ల కలెక్షన్స్ సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కార్తికేయ 2 సినిమాకు ఉత్తమ తెలుగు చిత్రంగా నేషనల్ అవార్డుని కైవసం చేసుకుంది. తెలుగు నుంచి కేవ‌లం కార్తికేయ 2 మిన‌హా మ‌రే మూవీ అవార్డుల‌ను అందుకోలేక‌పోయింది. ఈ సినిమా డివోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కించగా ఇందులోని కృష్ణతత్వం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *