కోలీవుడ్ స్టార్ నటులు ధునుశ్, నయనతార వివాదం ఇప్పట్లో ముగిసిపోయేలా కనిపించడం లేదు. తాజాగా నయనతారతో పాటు ఆమె భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్‌పై ధనుశ్ కేసు వేశారు. నయనతార డాక్యుమెంటరీలో తన అనుమతి లేకుండా ‘నేనూ రౌడీనే’ అనే సినిమా విజువల్స్ ఉపయోగించారని ధనుష్ ఆక్షేపించారు. దింతో ధనుష్ నిర్మాణసంస్థ మద్రాస్ హైకోర్టులో నయనతార, ఆమె భర్త విఘ్నేశ్ శివన్‌లపై సివిల్ కేసు దాఖలు చేసింది. ఈ కేసు తీర్పు కోలీవుడ్‌లో ఆసక్తికర చర్చకు దారితీస్తుంది.