రాజకీయ నాయకుడిగా అపూర్వ వారసత్వాన్ని మిగిల్చిన మాజీ ప్రధాని, ప్రముఖ కవి అటల్ బిహారీ వాజ్‌పేయి జీవితం ఆధారంగా ‘మేన్ అటల్ హూన్’ పేరుతో ఓ బయోపిక్ రూపొందుతోంది. ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి మాజీ ప్రధాని పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠితో పాటు బెనెడిక్ట్ గారెట్, రాజేష్ దూబే మరియు హర్షద్ కుమార్ తదితరులు నటిస్తున్నారు.నటరంగ్, బాలగంధర్వ వంటి జాతీయ అవార్డులను గెలుచుకున్న చిత్రాలకు పేరుగాంచిన చిత్రనిర్మాత రవి జాదవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వనుశాలి స్టూడియోస్ బ్యానర్‌పై వినోద్ భానుశాలి, సందీప్ సింగ్, కమలేష్ భానుశాలి ఈ చిత్రాన్ని నిర్మించారు. పంకజ్ త్రిపాఠి అటల్ జీని పోలి ఉండే అద్భుతమైన పోస్టర్‌లతో పాటు సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు.