పుష్ప-2 విడుదలకు ముందు డిసెంబరు 4వ తేదీ రాత్రి 9.30 గంటలకు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు, తాజాగా సంధ్య థియేటర్ యజమాని, మేనేజర్, మరియు సెక్యూరిటీ మేనేజర్ లను అరెస్ట్ చేసి, చీక్కడపల్లి పోలీసు స్టేషన్ నుంచి రిమాండ్ కు తరలించారు.

అదేవిధంగా, ఈ ఘటనపై హీరో అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసేందుకు అల్లు అర్జున్ ముందుకొచ్చి, రూ.25 లక్షల సాయం ప్రకటించారు. ఈ సందర్భంగా, బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *