మెదక్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడు పాయల దేవాలయం గత ఎనిమిది రోజులుగా జలదిగ్బంధంలో ఉంది. సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో 8 రోజులుగా మంజీరా నది ఆలయం ఎదురుగా ప్రవహిస్తోంది. మంజీర వరద అమ్మవారి పాదాలను తాకుతూ ప్రవహిస్తోంది. గుడి ముందు నుంచి మంజీర ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. గత ఎనిమిది రోజులుగా, ఆనకట్ట ఏడు అడుగుల ఆలయం లోపల ఉంది మరియు రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు కొనసాగుతున్నాయి.
గత కొన్ని రోజులుగా భారీగా వర్షాలు కురవడంతో మంజీరా బ్యారేజ్ నిండుకుండలా మారగా, గేట్లను ఓపెన్ చేశారు. ఈ క్రమంలోనే మెదక్‌లోని ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఇప్పటికే అమ్మవారి ఆలయం చుట్టూ మంజీరా నది ఉగ్రరూపం దాల్చింది. అమ్మవారి పాదాలను తాకుతూ ఏడు పాయలుగా చీలిపోయి ఆలయం ఎదుట పరవళ్లు తొక్కుతోంది. వరద ఉధృతి తగ్గిన తర్వాత యధావిధిగా భక్తులకు దర్శనం కల్పిస్తామని ఆలయ ఈవో తెలిపారు. వరదల కారణంగా మంజీరాలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు వనదుర్గ ప్రాజెక్టు వైపు వెళ్లకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.