దూర ప్రాంత ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. హైదరాబాద్‌లో ఆర్టీసీ పికప్‌ వ్యాన్‌ల సేవలు అమల్లోకి వచ్చాయని ప్రకటించింది. ఈ సేవలు శుక్రవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయని పేర్కొంది. తొలి విడతలో ఈసీఐఎల్‌- ఎల్బీనగర్‌ మధ్య ఉన్న ప్రాంతాల నుంచి ఈ పికప్‌ వ్యాన్‌ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. దూరప్రాంత ప్రయాణికుల కోసం ఆర్టీసీ ఈ పికప్‌ వ్యాన్‌లను తీసుకొచ్చింది.

మరోవైపు టీజీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఏసీ బస్సుల్లో ప్రయాణించే వారికి శుభవార్త చెప్పింది. అన్ని ఏసీ బస్సు టికెట్లపై 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఏసీ స్లీపర్, ఏసీ సీటర్-స్లీపర్, రాజధాని బస్సుల్లో ఈ ఆఫర్ అందుబాటులో ఉందని వారు తెలిపారు. సులభతరమైన సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఈ ఆఫర్‌ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఆఫర్‌ను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాల కోసం టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని వారు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *