తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ పరీక్షల నిర్వహణపై దృష్టి పెట్టింది. అధికార వర్గాల ప్రకారం, షెడ్యూల్ ఖరారు తుది దశలో ఉందని, వచ్చే వారంలో అధికారిక ప్రకటన వస్తుందని భావిస్తున్నారు. సమాచారం ప్రకారం, మార్చి 3న పరీక్షలు ప్రారంభమవ్వచ్చని, నెలాఖరులోగా పూర్తి చేయాలని న్ని పరీక్షలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరిలో పూర్తిచేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇంటర్ పరీక్షల ఫీజు గడువు డిసెంబర్ 3తో ముగిసింది. ఆలస్య రుసుముతో జనవరి 2 వరకు ఫీజు చెల్లించవచ్చు అని పేర్కొంది . ఈ సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా 9-10 లక్షల విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని అధికారులు వెల్లడించారు .