తెలంగాణలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు చలితో వణికిపోతున్నారు. ఉదయం 8 గంటల తర్వాత కూడా చలి గాలులు వీస్తున్నాయి. పది రోజులుగా ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోవడంతో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ తదితర జిల్లాల వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలోనే అత్యల్పంగా సంగారెడ్డి జిల్లాలో నమోదైంది. చలి తీవ్రతతో కూలీలు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు ఉదయం పూట బయటకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజువారీ పనులకు వెళ్లాలంటే దుప్పట్లు, స్వెటర్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.