తెలంగాణలో 10వ తరగతి పరీక్షల్లో విద్యాశాఖ మార్పులు చేసింది. ఇక నుంచి 100 మార్కుల పేపర్ ఉంటుంది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్నల్ మార్కులను రద్దు చేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 80 మార్కుల పేపర్, 20 మార్కులతో ఇంటర్నల్ పరీక్ష ఉండేది. అయితే ఆ పద్ధతిని తొలగించాలని విద్యాశాఖ నిర్ణయించింది. గత కొన్నేళ్లుగా గ్రేడింగ్ విధానంలో ఫలితాలు వెలువడుతున్నాయి. ఇటీవల ప్రభుత్వం గ్రేడింగ్ విధానాన్ని ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్నల్ మార్కుల్లో అవకతవకలపై ఫిర్యాదులు అందడంతో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.