రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర గృహ సర్వే (సామాజిక, విద్య, ఉపాధి మరియు రాజకీయ కులాల సర్వే 2024) విజయవంతంగా కొనసాగుతోంది. అన్ని వర్గాల సంక్షేమం, సామాజిక సాధికారత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ సర్వే యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. నవంబర్ 6న ప్రారంభమైన సర్వే 12 రోజుల్లోనే పూర్తయింది. ఆదివారం (నవంబర్ 17) నాటికి 58.3% సర్వే పూర్తయింది. సర్వేలో భాగంగా ప్రభుత్వం నవంబర్ 6 నుంచి 8 వరకు ఇంటి లెక్కింపు చేపట్టింది. సర్వేలో భాగంగా రాష్ట్రంలో మొత్తం 1,16,14,349 ఇళ్లను గుర్తించారు. నవంబర్ 9వ తేదీ నుంచి ఇంటింటి వివరాల సర్వే ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 67,72,246 కుటుంబాల సర్వే పూర్తయింది.
సర్వే విధుల్లో మొత్తం 20 వేల మంది ఎన్యుమలేటర్లు పాల్గొన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో మొత్తం 28 లక్షల 28 వేల కుటుంబాలు ఉన్నాయి. ప్రతి రోజు దాదాపు లక్ష కుటుంబాల సర్వే పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది జీహెచ్ఎంసీ.ఈ రోజు లక్ష 20 వేల కుటుంబాల సర్వే పూర్తి చేసింది సిబ్బంది. ఒక్కో ఇన్యుమరేటర్ రోజుకు 10 నుండి 15 ఇళ్ల సర్వే పూర్తి చేస్తున్నారు.