హైదరాబాద్: ఈ మధ్యకాలంలో విద్యార్థులు ఉన్నత చదువులకోసం ఎంతగానో అప్పు చేసి వివిధ దేశాలకి వెళ్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లోని కెయిర్న్స్ సమీపంలోని మిల్లా మిల్లా జలపాతంలో ఈతకు వెళ్లి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు నీటిలో మునిగి మృతి చెందారు. బాధితులు బాపట్ల జిల్లాకు చెందిన చైతన్య ముప్పరాజు, ప్రకాశం జిల్లాకు చెందిన సూర్య తేజ బొబ్బగా గుర్తించారు. వీరిఇద్దరు ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులు చదువుతున్నారు అని తెలిసింది.