సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఇసుకతో బీచ్‌లో తీర్చిదిద్దే తన అద్భుతమైన కళాఖండాలతో అందరినీ అబ్బురపరుస్తాడు. ఇసుకతో ఆయన వేసిన అద్భుతమైన చిత్రాలు మనసుల్ని కదిలిస్తాయి. అలాగే సుదర్శన్ తీర్చిదిద్దే ఇసుక కళాఖండాలు మనల్ని ఆలోచింపజేస్తాయి.
ఇక ఈరోజు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా మరో కళాఖండానికి ప్రాణం పోశారు. ఒడిశాలోని పూరీ బీచ్‌లో ‘కిల్ ది ఈవిల్’ అనే సందేశంతో శ్రీకృష్ణుడి శిల్పాన్ని తీర్చిద్దారు. ఎంతో అద్భుతంగా ఉన్న ఈ శిల్పం బీచ్‌కు వచ్చేవారిని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ తాలూకూ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో సుదర్శన్ పట్నాయక్ ప్రతిభకు నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అద్భుతమైన కళాఖండం అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.