పశ్చిమ బెంగాల్‎లో మరో రైలు ప్రమాదం జరిగింది. నవంబర్ 9న శనివారం సికింద్రాబాద్ నుండి షాలిమార్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఎక్స్ ప్రెస్ కు చెందిన పార్సిల్ వ్యాన్ తో పాటు ప్రయాణీకులు ఉన్న రెండు కోచ్ లు అదుపు త‌ప్పాయి. ఈ ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, రైల్వే సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఈ ప్ర‌మాదంలో ఎలాంటి ప్రాణ‌, ఆస్తి న‌ష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. రైలు మధ్య నుంచి బయటి పట్టాలపైకి మారుతున్న సమయంలో పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు. రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *