రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్ నుంచి లక్నో రైలు సర్వీసును ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈరోజు రైల్వే శాఖ ఈ ప్రత్యేక సేవను ప్రారంభించింది. ఈ ప్రత్యేక రైలు ఏపీ, తెలంగాణలోని పలు స్టేషన్లలో ఆగుతుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ఈ సర్వీసును ప్రారంభించింది.

సికింద్రాబాద్ నుండి లక్నో వరకు నడవనున్న ఈ స్పెషల్ రైలు ( నంబర్ 07084 ) నవంబర్ 15 ( శుక్రవారం ) రాత్రి 7: 05 గంటలకు సికింద్రాబాద్ లో బయలుదేరి, ఆదివారం ( నవంబర్ 17, 2024 ) సాయంత్రం 6గంటలకు లక్నో చేరుతుందని తెలిపింది రైల్వే శాఖ. మరో పక్క , ఇదే సర్వీసు నవంబర్ 18, 25 తేదీల్లో లక్నో నుంచి సికింద్రాబాద్ కు బయలుదేరుతుందని, సోమవారం ( నవంబర్ 18, 2024 ) ఉదయం 9: 50గంటలకు లక్నో నుంచి బయలుదేరి నవంబర్ 20 ( బుధవారం ) సాయంత్రం 3 గంటలకు సికింద్రాబాద్ చేరుతుందని తెలిపింది రైల్వే శాఖ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *