సంక్రాంతి పండుగ సంబరాలు పల్లెల్లో అంబరాన్ని తాకాయి. మూడు రోజుల పాటు ఘనంగా జరిగిన భోగి, సంక్రాంతి, కనుమ పండగ ముగియడంతో, తిరిగి పట్నం బాట పట్టారు జనం. పండుగ పూట సొంత ఊరు వెళ్లి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో సరదాగా గడిపారు. ఇక, కోళ్ల పందాలు, గుండాట ఇలా పలు రకాల ఆటల్లో పాల్గొన్నారు. కొందరు డబ్బులు పోగొట్టుకుంటే, మరికొందరు డబ్బులు కొన్ని వెనకేసుకున్నారు. మరోవైపు, పండగకు ముందు హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ వైపు వెళ్లే రహదారులు, ముఖ్యంగా విజయవాడ హైవే రద్దీగా మారింది. ఎక్కడి కక్కడ భారీగా ట్రాఫిక్‌ జామ్‌ కాగా, ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయ్యింది. పల్లెకు బైబై చెబుతూ పట్నం బాట పట్టారు.

అయితే, సంక్రాంతి పండుగ ముగించుకుని నగరవాసుల తిరుగుపయనం పట్ల ప్రత్యేక ఏర్పాట్లుకు ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ ప్రయాణికుల జాగ్రత్తలపై అధికారులను ఆదేశించారు. విజయవాడ నుండి ఇప్పటికే పలు ప్రత్యేక ఏర్పాటు చేశామని, ప్రయాణికులు అందరూ రవాణా భద్రతలు పాటించి సురక్షితంగా గమ్యం చేరుకోవాలని కోరారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. మరోవైపు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని గోదావరి జిల్లాల నుంచి కూడా ప్రత్యేక సర్వీసులు నడుతపున్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా స్పెషల్‌ సర్వీసులు నడుస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *