నేడు ఆంధ్రప్రదేశ్ లో వర్షం కురిసే ప్రాంతాలను వాతావరణ శాఖ ప్రకటించింది. తూర్పు మధ్య మరియు ఆగ్నేయ అరేబియా సముద్రంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా, ఇది సముద్ర మట్టానికి పైగా సుమారు 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల అవర్తనంగా విస్తరించింది. ఈ అల్పపీడనం రాబోయే 24 గంటల్లో పశ్చిమ దిశగా కదులుతూ బలహీనమయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
ఈ పరిణామాల ప్రభావంతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరియు యానంలో తూర్పు, ఆగ్నేయ దిశల నుండి గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో ఈ రోజు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఊరుములతో కూడిన జల్లులు పడవచ్చని వాతావరణ శాఖ తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.