ఓకే’ అన్న రెండక్షరాల పదం ఓ దాంపత్య జీవితంలో నిప్పులు పోసి, భారతీయ రైల్వేకు అక్షరాలా మూడు కోట్ల రూపాయల నష్టాన్ని తెచ్చిపెట్టింది. వివరాల్లోకి వెళ్తే , ఒక రైల్వే స్టేషన్ మాస్టర్,చత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌కు చెందిన యువతిని అక్టోబర్ 12, 2011న వివాహం చేసుకున్నాడు. వివాహం సజావుగా సాగినా, ఒక ఫోన్ సంభాషణలో వాదం మధ్య అతను “ఓకే” అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. అదే సమయంలో పక్క స్టేషన్‌లో ఉన్న మాస్టర్, ఈ “ఓకే”ని గూడ్సు రైలుకు సిగ్నల్‌గా భావించి రైలును నిషిద్ధ ప్రాంతం గుండా పంపించాడు. ఆ రైలు మావోయిస్టు ప్రభావిత నిషిద్ధ ప్రాంతం గుండా బయలుదేరింది. రాత్రి పరిమితులను ఉల్లంఘించి అనధికారిక మార్గంలో రైలు ప్రయాణించినందుకు గాను రైల్వే రూ. 3 కోట్ల జరిమానా చెల్లించాల్సి వచ్చింది.
రైల్వేకి భారీ జరిమానా విధించడంతో స్టేషన్ మాస్టర్ సస్పెండ్ అయ్యాడు. ఆ ఘటనకే భార్య కారణమని భావించిన మాస్టర్ విడాకులు కోరగా, కేసు చివరికి హైకోర్టులో నడిచింది.12 ఏళ్లపాటు కొనసాగిన ఈ కేసులో తాజాగా తుది తీర్పు వచ్చింది. చివరకు హైకోర్టు భార్య తప్పులనే నిర్ధారిస్తూ విడాకులు మంజూరు చేసింది.