హైదరాబాద్ నగర వ్యాప్తంగా శబ్ధ కాలుష్యం పెరిగిన నేపథ్యంలో నగరంలో డీజేలపై నిషేధం విధించింది. ఈ మేరకు ఇవాళ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. మతపరమైన ర్యాలీలు, జూలూస్‌లలో డీజేను ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసారు. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు నిషేధం విధించినట్లు తెలిపారు. ఇక నుంచి కేవలం పరిమిత స్థాయిలో మాత్రమే సౌండ్ సిస్టమ్ లను అనుమతిస్తామని వెల్లడించారు.
ఆసుపత్రులు, స్కూళ్లు, కాలేజీలు, కోర్టు పరిసర ప్రాంతాల్లో 100 మీటర్ల దూరంలో నిషేధాజ్ఞలు విధించారు. అదేవిధంగా రాత్రి వేళల్లో జస సమూహం ఉన్న ప్రాంతాల్లో 45 డెసిబెల్స్‌కు నుంచి సౌండ్‌ను పెట్టరాదని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి బిఎన్ఎస్ చట్టం ప్రకారం ఐదేళ్ల వరకు జైలు శిక్ష తోపాటు జరిమానా పడే అవకాశం ఉందని ఉత్వర్వుల్లో పేర్కొన్నారు.