నాగ చైతన్య-సమంతల విడాకుల విషయంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనే కాకుండా సినీ వర్గాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీంతో మంత్రి వ్యాఖ్యలను అందరూ ముక్తకంఠంతో ఖండించారు. దాంతో తాజాగా కొండా సురేఖ స్పందించారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు.
తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడం మాత్రమేనని అన్నారు. కానీ సమంత మనోభావాలను దెబ్బతీయడం కాదని స్పష్టం చేశారు. స్వయం శక్తితో ఆమె ఎదిగిన తీరు తనకు ఆదర్శం అని సురేఖ అన్నారు. తన వ్యాఖ్యల వల్ల సమంత కానీ, ఆమె ఫ్యాన్స్ కానీ మనస్తాపానికి గురయినట్లైతే బేషరతుగా ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.