సినీ హీరో నాగార్జున నేడు నాంపల్లి కోర్టుకు హాజరు కానున్నారు. పరువు నష్టం దావా కేసులో నాగార్జున తన స్టేట్‌మెంట్ ఇచ్చేందుకు న్యాయస్థానానికి రానున్నారు. నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో నాగార్జున తన వాంగ్మూలాన్ని నమోదు చేయాలని కోర్టు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఉత్తర్వులు జారీచేయడంతో ఈరోజు ఆయన నాంపల్లి కోర్టుకు హాజరు కానున్నారు.
తెలంగాణ మంత్రి కొండా సురేఖ తన కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై నాగార్జున పరువు నష్టం దావా కేసును దాఖలు చేసిన విషయం తెలిసిందే. నిన్న ఈ కేసును విచారించిన న్యాయమూర్తి నాగార్జునతో పాటు, సాక్షుల స్టేట్‌మెంట్ ను కూడా రికార్డు చేయాలని ఆదేశిస్తూ కేసు విచారణను నేటికి వాయిదా వేశారు. దీంతో నేడు కోర్టుకు నాగార్జున హాజరు కానున్నారు.