నాచారం పీఎస్ పరిధిలో అగ్నిప్రమాదం జరిగింది. సురానా వైర్స్ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే అప్రమత్తమైంది. సకాలంలో ఘటనా స్థలానికి చేరుకుంది. దీంతో మంటలు అదుపులోకి వచ్చాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఇటీవలి పారిశ్రామిక అగ్నిప్రమాదాలు భారీ ఆస్తి నష్టం మరియు ప్రాణ నష్టం ఫలితంగా. యాజమాన్యాలు నిబంధనలు పాటించకపోవడమే ఇందుకు కారణం. పారిశ్రామిక వాడలు ప్రమాదాలకు కేరాఫ్ గా మారాయి. ఈ పరిశ్రమల్లో వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో తెలుగు రాష్ట్రలతో పాటు బీహార్, గుజరాత్, ఒరిస్సా కంపెనీలకు చెందిన వారు కూడా ఉన్నారు. ముఖ్యంగా పటాన్‌చెరు, జిన్నారం, ఐడీఏ బొల్లారం, కంది, హత్నూర, సదాశివపేట తదితర మండలాల్లో భారీ పరిశ్రమలు ఉన్నాయి. ఈ కంపెనీల్లో తరచూ అగ్ని ప్రమాదాలు, పేలుళ్లు సంభవిస్తున్నాయి. దీంతో కార్మికుల భద్రత సవాల్‌గా మారింది.