Latest News Telugu Breaking

News5am, Latest News Telugu Breaking (10-06-2025): కరోనా మళ్లీ దేశవ్యాప్తంగా విజృంభిస్తోంది. జూన్ 10 నాటికి మొత్తం కేసులు 6,815కు చేరగా, 24 గంటల్లో 324 కొత్త కేసులు, 3 మరణాలు నమోదయ్యాయి. ఈ మరణాలు ఢిల్లీ, జార్ఖండ్, కేరళలో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి. కేరళలో 2,053 యాక్టివ్ కేసులు ఉండగా, కొత్తగా 96 కేసులు వెల్లడయ్యాయి. గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ కేరళ తర్వాత కరోనా కేసుల్లో ముందున్న రాష్ట్రాలుగా ఉన్నాయి. ఢిల్లీలో 24 గంటల్లో 37 కేసులు నమోదయ్యాయి. మరోవైపు, మహారాష్ట్రలో సోమవారం 65 కేసులు వచ్చాయి. ముంబైలో 22, పూణెలో 29 కొత్త కేసులు నమోదయ్యాయి. జనవరి నుంచి రాష్ట్రంలో 17,000 పరీక్షలు జరిగాయని, ఈ ఏడాది మొత్తం కేసులు 1,504కి చేరినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఈ ఏడాది మహారాష్ట్రలో 18 కరోనా మరణాలు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 783 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు సమాచారం. కరోనా కేసుల పెరుగుదలకు JN.1, NB.1.8.1, LF.7, XFC అనే ఓమిక్రాన్ సబ్‌వేరియంట్లే కారణమని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. వాటిని WHO “పర్యవేక్షణలో ఉన్న వేరియంట్లు”గా గుర్తించింది. ప్రస్తుతం ఈ వేరియంట్లపై తీవ్ర ఆందోళన అవసరం లేదని, అయినా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

More Latest News Telugu:

Latest News Telugu Breaking:

దేశంలో కరోనా డేంజర్ బెల్స్..

హడలెత్తిస్తున్న కోవిడ్..

More News Telugu: External Sources

కరోనా కేసులు 7 వేలు.. ఆ రాష్ట్రాల్లో ముగ్గురు మృతి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *