ఇటీవలి కాలంలో హిందూ దేవాలయాలపై దాడులు కలకలం రేపుతున్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లా కోఠి రాంపూర్ హనుమాన్ దేవాలయంలో చోరీ జరిగింది. తాళం పగులగొట్టిన దొంగలు పంచలోహ విగ్రహాలను ఎత్తుకెళ్లారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ద్వారా దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నించారు.
ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో శనివారం కొందరు అయ్యప్ప భక్తులు, అయ్యప్ప స్వామి, గణపతి స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పంచలోహ విగ్రహాలను గుడిలో తాత్కాలికంగా ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం రాత్రి 12 గంటల సమయంలో అయ్యప్ప స్వాములు దేవాలయం నుంచి వెళ్లిపోయారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన దేవతామూర్తుల వద్ద పూజారి తో పాటు వంట పని చేసే వాళ్లు దేవాలయాన్ని శుభ్రం చేసే వారు నిద్రపోయారు. ఆదివారం తెల్లవారుజామున నిద్రలేచేసరికి పంచలోహ విగ్రహాలు కనిపించలేదు. వెంటనే వారు ఆలయ చైర్మన్ కు ఫిర్యాదు చేశారు.