ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ విద్యార్థులకు నేటి నుంచి మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ హయాంలో దెబ్బతిన్న ఇంటర్మీడియట్ విద్యను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ పథకం ప్రారంభచనున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని 1,48,419 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించనున్నారు. విజయవాడ పాయకాపురంలో మంత్రి లోకేష్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆయా నియోజకవర్గాల మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు.

ప్రధానంగా ఈ పథకం పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా మారనుంది. అనేక ప్రాంతాలలో ఉదయం 8 గంటలకు బయలుదేరి చాలామంది విద్యార్థులు చాలా దూరం ప్రయాణించి కాలేజీకి చేరుకుంటున్నారు. వారందరికీ మధ్యాహ్న భోజనం అందించడం మంచి తోడ్పాటును అందించనుంది.

ఇక మధ్యన భోజనంలో ఏం పెడతారన్న విషయానికి వస్తే..

  • సోమవారం నాడు అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ అందిస్తారు.
  • మంగళవారం నాడు అన్నం, పప్పు, ఎగ్ కర్రీ, రసం, రాగిజావ అందిస్తారు.
  • బుధవారం నాడు వెజ్‌ పులావ్, ఆలూ కుర్మా, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ అందిస్తారు.
  • గురువారం నాడు అన్నం, సాంబార్, ఎగ్ కర్రీ, రాగిజావ అందిస్తారు.
  • శుక్రవారం నాడు పులిహోర, గోంగూర లేదా కూరగాయలతో చేసిన చట్నీ, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ అందిస్తారు.
  • శనివారం నాడు అన్నం, వెజ్ కర్రీ, రసం, రాగిజావ, పొంగల్‌ స్వీట్ అందిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *