హైడ్రా మళ్లీ నోటీసులు ఇవ్వడం ప్రారంభించింది. ఓ పక్క చెరువుల ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీఎల్, బఫర్ జోన్ల బౌండరీలను ఫిక్స్ చేసే పనిలో ఉన్న హైడ్రా. ప్రస్తుతం ప్రభుత్వ స్థలాలను కాపాడే పనిలో పడింది. జీహెచ్ఎంసీ పరిధిలో నోటీసులిచ్చేందుకు అనుమతులు లభించడంతో అక్రమార్కులపై చర్యలు చేపడుతుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని పార్కులు, రోడ్ల స్థలాలు, నాలాలు, ఫుట్ పాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు తదితర ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసిన వారికి దాదాపు 50 వరకు హైడ్రా అధికారులు ఇటీవల నోటీసులు జారీ చేశారు.

వారం కిందట నోటీసులిచ్చినా స్పందించకపోవడంతో బుధవారం మన్సురాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రోడ్డు ఆక్రమించి చేపట్టిన ఒక రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నేలమట్టం చేశారు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టడంతో పాటు ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్న వారే లక్ష్యంగా హైడ్రా ముందుకెళ్తుంది. నోటీసులిచ్చిన తర్వాత వారం నుంచి 15 రోజుల టైమ్ ఇస్తున్నారు. లేఅవుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో కూడా పార్కులకు సంబంధించి వదిలిపెట్టిన స్థలాలను ఆక్రమిస్తున్న వారికి కూడా నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పటికే జారీ అయిన నోటీసులకు స్పందించకపోతే కూల్చివేతలు చేపడుతున్నారు. ఈ నెలాఖరకు మరికొన్ని ఆక్రమణలను కూల్చివేసేందుకు హైడ్రా రెడీ అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *