చార్మినార్‌ను కూల్చమని ఎమ్మార్వో చెబితే మీరు కోల్చేస్తారా? హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా కూల్చివేతపై యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. బాధితుల పిటిషన్‌ను ధర్మాసనం ఇవాళ విచారించింది హైడ్రా కమీషనర్ రంగనాథ్ వర్చువల్‌గా హైకోర్టుకు హాజరై హైడ్రా కూల్చివేతపై వివరణ ఇచ్చారు. అయితే విచారణ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రాకు చట్టబద్ధత ఏమిటని కమిషనర్‌ను ప్రశ్నించారు. ఎమ్మార్వో ఆదేశాల మేరకే కూల్చివేశామని కమిషనర్ రంగనాథ్ సమాధానమివ్వడంతో, హైకోర్టు సీరియస్ అయింది. అయితే చార్మినార్‌ను కూల్చమని ఎమ్మార్వో అడిగితే కూల్చేస్తారా? అని నిలదీసింది.
ఇక, విచారణ సందర్భంగా అమీన్‌పూర్ తహసీల్దార్ వివరణపై సంతృప్తి చెందని హైకోర్టు న్యాయమూర్తి, ఆదివారం నాడు ఎలా కూలుస్తారని ఎమ్మార్వో పై ఆగ్రహం వ్యక్తం చేశారు, భవనాన్ని 48 గంటల్లో ఖాళీ చేయాలని నోటీసు ఇచ్చి, 40 గంటల్లోపే భవనాన్ని ఎలా కూలుస్తారు? అని నిలదీసింది, ఇలా కూల్చివేతలు చేస్తే ఇంటికి వెళ్లిపోతారంటూ ఎమ్మార్వోను హెచ్చరించింది, మరోవైపు, నేనడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పండి జంప్ చేయకండి. అమీన్ పూర్ గురించే మాట్లాడండి పైగా, నేను కావూరి హిల్స్ గురించి అడగలేదు, అంటూ హైడ్రా కమీషనర్ పై హైకోర్టుకు చిర్రెత్తుకొచ్చింది. కోర్టుకు హాజరుకావాలని హైడ్రా కమిషనర్‌కు కోర్టు నోటీసు జారీ చేయడంతో రంగనాథ్ వర్చువల్ ద్వారా విచారణకు హాజరయ్యారు.