ప్రపంచ దేశాలు నూతన సంవత్సర వేడుకలకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు అర్దరాత్రి వరకు మెట్రో ట్రైన్స్ నడవనున్నాయి. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రవాణా ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లకు క్షేమంగా వెళ్లాలని ఎల్‌అండ్‌టీ మెట్రో ఎక్స్ వేదికగా తెలిపింది.
ఈ ఉద్దేశంతోనే మెట్రో రైలు సర్వీసులను పొడిగించినట్లు చెబుతున్నారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఆందోళన చెందకుండా మెట్రో రైళ్ల సమయాన్ని పొడిగించారు. నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకుని నేడు మెట్రో రైళ్ల సమయాన్ని పొడిగించినట్లు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.