హైదరాబాద్‌లో పలుచోట్ల అగ్ని ప్రమాదాలు కలకలం సృష్టించాయి. పలుచోట్ల అగ్ని ప్రమాదాలు చోటుచేసుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎక్కడ ప్రమాదం జరిగినా క్షణాల్లోనే మంటలు అదుపులోకి వచ్చాయి. అయితే నగరంలో అగ్ని ప్రమాదాలు జరగడంతో నగర ప్రజలు భయాందోళనకు గురయ్యారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ వీధి నంబర్ 18లో అగ్నిప్రమాదం జరిగింది. ఓ అపార్ట్మెంట్ నాలుగో అంతస్తులో మంటలు చెలరేగాయి. మంటలు వ్యాపించడంతో అందులో ఉన్నవారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అగ్నికి కారణం, ఉదయం ఫ్లాట్‌లో పూజలు చేసి ఫ్లాట్ యజమాని బయటకు వెళ్లాడు. వెళ్ళేటప్పుడు బాల్కనీ తలుపు తెరిచాడు. దీంతో గాలికి పూజ చేసిన చోట దీపం పెట్టడంతో ఫ్లాట్ లో మంటలు వ్యాపించాయని పోలీసులు తెలిపారు.