ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో మైదానంలో మెరుపు దాడి జరిగింది. దీంతో ఓ క్రీడాకారుడు చనిపోయాడు. రిఫరీతో పాటు పలువురు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన రిఫరీని ఆస్పత్రికి తరలించారు. ఆదివారం జరిగిన ఈ ఘటన క్రీడా ప్రపంచంలో ఓ విషాద ఘటనగా చెప్పుకోవచ్చు. ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతుండగా మైదానంలో పిడుగు పడింది.
తీవ్రంగా గాయపడిన ఆటగాళ్లను, రిఫరీని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషాద ఘటన పెరూలో జరిగింది. నవంబర్ 3న, పెరూలోని చిల్కాలో రెండు దేశీయ క్లబ్‌లు జువెంటుడ్ బెల్లావిస్టా, ఫామిలియా చొక్కా మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మ్యాచ్ జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ సమయంలో జువెంటుడ్ బెల్లావిస్టా మ్యాచ్‌లో 2-0 ఆధిక్యంలో ఉంది. ఈ సమయంలో వాతావరణం అనుకూలంగా లేకపోడంతో, రెఫరీ విజిల్ వేసి గేమ్‌ను నిలిపివేశాడు. అలాగే ఆటగాళ్లను మైదానం వీడాల్సిందిగా కోరారు. ఈ సమయంలో ఆటగాళ్లు వెళ్లిపోతుండగా ఒక్కసారిగా పిడుగు పడింది. ఈ మెరుపు 39 ఏళ్ల ఆటగాడు జోస్ హ్యూగో డి లా క్రూజ్ మెసాపై పడింది. దాంతో అతడు చనిపోయాడు. మెరుపు కారణంగా, రిఫరీతో సహా 5 మంది ఆటగాళ్లు కలిసి మైదానంలో పడిపోయారు.