తెలుగు రాష్ట్రాల్లో పండుగలంటే చాలు గుర్తొచ్చేది చుక్క, ముక్క. ఈ రెండు లేకుండా తెలంగాణలో ఏ పండుగలు జరగవు. ఇందులో భాగంగా దసరా పండుగ సీజన్ ప్రారంభం కావడంతో భారీగా అమ్మకాలు జరిగినట్లు తెలుస్తుంది. దసరా పండుగకు ముందు వరుస సెలవుల నేపథ్యంలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. గత 9 రోజుల్లో రూ.713.25 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. రేపు దసరా కావడంతో ఈ మూడు రోజుల్లో సేల్స్ ఎక్కువగా జరుగుతాయని అంచనా వేస్తున్నారు.

గత ఏడాదితో పోలిస్తే రూ.350 కోట్ల అమ్మకాలు అదనంగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఈ సారి బీర్ల కంటే లిక్కర్ అమ్మకాలే ఎక్కువ జరుగుతున్నట్లు అధికారులు చెప్తున్నారు. మద్యం అమ్మకాలు తెలంగాణ ప్రభుత్వానికి కాసులు వర్షం కురిపిస్తుంది. ఈ దసరా పండుగని ధనిక, పేద తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఘనంగా జరుపుకుంటారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *