సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరుణ్‌ రామచంద్రన్‌ పిళ్లైకి ఢిల్లీ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. జస్టిస్‌ నీనా బన్సల్‌ కృష్ణ బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అరుణ్‌ రామచంద్రన్‌ పిళ్లై హైదరాబాద్‌ కు చెందిన వ్యాపారవేత్త. పిళ్లై… బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు సన్నిహితుడని, లిక్కర్‌ స్కాంలో కవిత ప్రయోజనాల కోసం పిళ్లై పనిచేశాడని, ఇండోస్పిరిట్‌ లిక్కర్‌ కంపెనీ ఎండీ సమీర్‌ మహేంద్రు నుంచి లంచాలు స్వీకరించి, ఆ లంచాలను అందించాడని ఆయనపై ఈడీ అభియోగాలను మోపింది. విచారణ సమయంలో పిళ్లై తప్పుడు వాంగ్మూలం ఇచ్చాడని, సాక్ష్యాధారాలను నాశనయం చేయడంలో ఆయన పాత్ర కూడా ఉందని ఈడీ ఆరోపిస్తోంది. అరుణ్‌ పిళ్లైని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ గతేడాది మార్చిలో 6వ తేదీన అరెస్ట్ చేసింది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *