హైదరాబాద్ లో నెల రోజుల పాటు ఆంక్షలు విధిస్తూ నగర కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులో పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో ఎలాంటి ర్యాలీలు, ప్రదర్శనలకు అనుమతి లేదని ఆయన వెల్లడించారు. నగరమంతా 144వ సెక్షన్ విధించనున్నామని తెలిపారు. అనుమతి లేకుండా ర్యాలీలు, ఆందోళనలు, ప్రదర్శనలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
నెల రోజుల పాటు హైదరాబాద్ లో ఈ ఆంక్షలు అమలులో ఉండనున్నాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు కానీ ఇతరులు కానీ ఎటువంటి ఆందోళనలు చేయడానికి వీలు లేదని తెలిపారు. 144వ సెక్షన్ కింద ఆంక్షలు విధించినట్లు తెలిపారు. దీనిని గమనించి అందరూ నడుచుకోవాలని ఆయన సూచించారు.