మంచు మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దాడి చేసిన కేసులో పోలీసులు చర్యలు ప్రారంభించారు. 118 బీఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేసిన రాచకొండ పోలీసులు, ఈ రోజు ఉదయం 10:30 గంటలకు విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు.

మంగళవారం రాత్రి జరిగిన ఘర్షణలో మోహన్ బాబు తలకు గాయమవడంతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నట్లు అయన పీఆర్‌ టీమ్‌ పేర్కొంది. ఈ దాడి ఘటనపై జర్నలిస్టు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మోహన్ బాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆయన నివాసం వద్ద జర్నలిస్టులు ఆందోళన చేపట్టగా, ఈ ఘటనపై సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *