News5am, Breaking Telugu News 1(13-05-2025): అండమాన్ తీరానికి నైరుతి రుతుపవనాలు చేరుకున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ అండమాన్, నికోబార్ దీవుల్లో రుతుపవనాలు కేంద్రితమయ్యాయని, రాబోయే మూడు నాలుగు రోజుల్లో ఇవి మధ్య బంగాళాఖాతంలోకి విస్తరించి, ఈ నెలాఖరుకు కేరళను తాకనున్నట్లు అధికారులు తెలిపారు. ఈసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెప్పారు. తూర్పు యూపీ, బీహార్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడనున్న నేపథ్యంలో దక్షిణ ఒడిశా తీరం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుందని పేర్కొన్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదు రోజుల పాటు చెదురు ముదురు వర్షాలు పడే అవకాశముంది.
విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథకుమార్ ప్రకారం, కోస్తా ప్రాంతాల్లో ఈరోజు తేలికపాటి వర్షాలు, రేపు చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురవచ్చు. రుతుపవనాలు ఈసారి రెండు రోజులు ముందే వచ్చినట్లుగా ఐఎండీ అంచనా వేసింది. ఈ నెలాఖరుకు కేరళ తీరాన్ని తాకిన తర్వాత, రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తాయని తెలిపారు. రాబోయే వారం రోజుల్లో ఉత్తర కోస్తా జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురవొచ్చని, కోస్తా మొత్తం మీద ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని చెప్పారు.
More Breaking Telugu News
Breaking Telugu News 1:
జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
చార్మినార్ వద్ద సుందరీమణులు హెరిటేజ్ వాక్..
More Telugu News: External Sources
అండమాన్ తీరానికి నైరుతి రుతుపవనాలు.. ఈ సారి భారీగా వర్షాలు!