బిత్తిరి సత్తి అంతే తెలుగు రాష్టాలలో తెల్వని వ్యక్తి ఉండరు. తెలంగాణ యాసతో గుర్తింపు పొందిన నటుడు బిత్తిరి సత్తి (చేవెళ్ల రవి) ఓ షాట్ వీడియోతో వివాదంలో చిక్కుకున్నాడు. తాజాగా ఈయన భగవద్గీతపై చేసిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ వీడియో చర్చనీయాంశంగా మారింది. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే భగవద్గీతను కించపరిచేలా ఈయన చేసిన వీడియో పై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. దీంతో ఆగ్రహించిన ఈ సంఘాలు బిత్తిరి సత్తిపై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసారు. దీంతో కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హిందువులు ఎంతో పవిత్రంగా భావించే భగవద్గీత పై తనదైన శైలిలో పేరడీగా చేసుకుంటూ పోయాడు. కాగా, భగవద్గీతను బిల్లుగీత అంటూ పేరు పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ షాట్ వీడియోపై రాష్ట్ర వానరసేన దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వీడియోను తొలగించి క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. కొన్నివేల మందికి ఆ వీడియో నచ్చిందని.. మీకు నచ్చకపోతే నేనేం చేయాలంటూ నిర్లక్షంగా బిత్తిరి సత్తి సమాధానం ఇచ్చాడు.