ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షల ఫీజు చెల్లింపు ప్రక్రియ ఈ నెల 22 నుంచి ప్రారంభమవుతుందని తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టీఓఎస్) డైరెక్టర్ పీవీ శ్రీహరి తెలిపారు. రూ.25 లేట్ ఫీజుతో సెప్టెంబర్ 4 వరకు, రూ.50 ఫైన్‌తో సెప్టెంబర్9 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు.
అక్టోబర్ మొదటి వారంలో టెన్త్ పబ్లిక్ పరీక్షలు ఉంటాయని తెలిపారు. విద్యార్థులు http://www.telanganaopenschool.org వెబ్‌సైట్ ద్వారా లేదా TG ఆన్‌లైన్ లేదా మీసేవా ద్వారా ఫీజు చెల్లించాలని సూచించారు.