ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఛైర్పర్సన్గా రిటైర్డ్ ఐపీఎస్ అధికారిణి అనురాధను నియమిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి నీరబ్కుమార్ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు . విజయవాడ బందర్ రోడ్డులోని ఏపీపీఎస్సీ కార్యాలయంలోని ఛాంబర్లో బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆమెతో ఏపీపీఎస్సీ కార్యదర్శి జే ప్రదీప్ కుమార్ పదవీ ప్రమాణస్వీకారం చేయించారు.
బాధ్యతల స్వీకరణ అనంతరం ఏపీపీఎస్సీలో ప్రస్తుతం పెండింగ్లో ఉన్న నియామకాలపై బోర్డు సభ్యులు, అధికారులతో అనురాధ సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రూప్-1, గ్రూప్-2తో పాటు నిర్వహించాల్సిన పలు నియామక పరీక్షలు, ఇంటర్వ్యూలపై ఛైర్పర్సన్ ఆరా తీశారు.