ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ అయ్యింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముక్యంగా రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం పాలసీ రూపకల్పనపై కసరత్తు చేస్తోంది. కొత్త విధానం రూపకల్పనకు వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ 1 నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. గత ప్రభుత్వం హయాంలో అనుసరించిన మద్యం విధానంలో భారీగా అవినీతి జరిగిందని, వేల కోట్ల స్కామ్ జరిగిందని టీడీపీ నేతలు ఆరోపించారు.
వైసీపీ హయాంలో నాసిరకం మద్యం మాత్రమే విక్రయించి కోట్ల రూపాయలు కొల్లగొట్టారని, ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నారంటూ ఆరోపించిన చంద్రబాబు నాణ్యమైన మద్యం తక్కువ ధరలకు అందిస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన మద్యం సరఫరా చేయాలనీ నిర్ణయం తీసుకుంది.