ప్రముఖ సినీ నటుడు నాగార్జున తన కుమారుడు నాగచైతన్య, నూతన కోడలు శోభితతో కలిసి శ్రీశైలంలోని మల్లన్న స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఇటీవల నాగచైతన్య, శోభిత వివాహం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా, కొత్త దంపతులతో పాటు కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకున్నారు.

ఈ పుణ్యక్షేత్రంలో మల్లన్న స్వామికి ప్రత్యేకంగా రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణలతో నూతన దంపతులకు ఆశీర్వచనం చేశారు. ఈ సందర్బానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ వైరల్ అవుతున్నాయి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *