హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ ఘటనపై ప్రముఖ నటుడు అల్లు అర్జున్ స్పందించారు. పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా ఈ దురదృష్టకర సంఘటన జరిగినట్లు తెలియగానే షాక్‌కు గురైనట్లు తెలిపారు. రేవతి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు ప్రకటించారు. మీకు నేను ఉన్నాను… నన్ను నమ్మండి అని చెప్పడానికి ఈ డబ్బును ఇస్తున్నానన్నారు అని పేర్కొన్నారు . రేవతి పిల్లలకు ఏ సాయం కావాలన్నా చేసేందుకు సిద్ధమే అన్నారు.
ఈ ఘటనలో గాయపడిన రేవతి కుటుంబ సభ్యుల ఆసుపత్రి ఖర్చులు కూడా భరిస్తామని వెల్లడించారు. ఇది ఆ కుటుంబానికి చాలా క్లిష్ట సమయమన్నారు. వారికి ఏ అవసరం కావాలన్నా తాము ఉంటామన్నారు.అలాగే, చిత్రప్రియులందరికీ విజ్ఞప్తి చేస్తూ, థియేటర్లలో జాగ్రత్తగా ఉండాలని, సినిమాను ఆనందంగా చూసి సురక్షితంగా ఇంటికి చేరుకోవాలని సూచించారు.