హైదరాబాద్, అబిడ్స్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మయూర్ క్రేకర్స్ షాపులో ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. దాంతో.. ఒక్కసారిగా క్రేకర్స్ కాలుతూ. చెల్లా చెదురుగా ఎగిరాయి. దాంతో పక్కనే ఉన్న హోటల్ లో ప్రజలు బయటకు పరుగులు తీశారు. క్రేకర్స్ అంటుకోవడంతో ఆ మంటలు పక్కన ఉన్న ఒక హోటల్‌కి వ్యాపించాయి. సమాచారం అందుకున్న పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు.
ప్రస్తుతం 4 ఫైరింజన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాద మంటలు వ్యాపించినప్పుడు హోటల్ లో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణ నష్టం జరగలేదని అంటున్నారు. ఆరుగురికి గాయాలవ్వగా ఆస్పత్రికి తరలించారు. ఈ మంటలు బయటకు ఎగసిపడటంతో అక్కడే పార్క్ చేసిన పలు వాహనాలు మంటల్లో దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాదంలో భారీ ఆస్తి నష్టం వాటిలినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.