రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్-3 పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నెల 17, 18 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఏర్పాట్లు పూర్తి చేసింది. మొదటి రోజు రెండు పరీక్షలు, రెండో రోజు ఒక పరీక్షలు నిర్వహిస్తారు. 17న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1, అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు.పేపర్-3 పరీక్ష 18న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తారు.
పరీక్షా కేంద్రానికి కనీసం గంట ముందుగా చేరుకోవాలని టీజీపీఎస్సీ సూచించింది. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే సెంటర్ల గేట్లను మూసివేస్తామని, నిమిషం ఆలస్యమైనా అనుమతించమని స్పష్టం చేశారు. ఉద్యోగాల తుది ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే వరకు అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్లు మరియు ప్రశ్నపత్రాలను భద్రంగా ఉంచుకోవాలని TGPSC సూచించింది. డూప్లికేట్ హాల్ టిక్కెట్లు జారీ చేయబడవు.